ప్రైవేట్ పార్ట్‌పై తన్నిన స్నేహితుడు.. 10 ఏళ్ల బాలుడు మృతి

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఫతేహాబాద్‌లోని కుటక్‌పూర్ గైలా గ్రామంలో మొక్కజొన్నలు(కార్న్‌) తిని ఉమ్మడంతో పిల్లల మధ్య జరిగిన గొడవలో 10 ఏళ్ల బాలుడు మరణించాడు.

By Medi Samrat
Published on : 19 July 2025 2:30 PM IST

ప్రైవేట్ పార్ట్‌పై తన్నిన స్నేహితుడు.. 10 ఏళ్ల బాలుడు మృతి

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఫతేహాబాద్‌లోని కుటక్‌పూర్ గైలా గ్రామంలో మొక్కజొన్నలు(కార్న్‌) తిని ఉమ్మడంతో పిల్లల మధ్య జరిగిన గొడవలో 10 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ గొడవలో 12 ఏళ్ల నిందితుడు మృతుడి కాళ్ల మధ్య ప్రైవేట్ పార్ట్‌పై తన్నాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని కుటుంబ సభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతదేహంతో బంధువులు ఇంటికి చేరుకున్నారు. పోలీసులు వారికి వివరించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. చిన్నారి బంధువులు ఇంకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు చోటుచేసుకుంది. కుటక్‌పూర్ గోలా నివాసి సురేష్ చంద్ 10 ఏళ్ల కుమారుడు అజయ్. 12 ఏళ్ల బాలుడు గ్రామంలోని భాను ప్రతాప్ సింగ్ త్యాగి కిరాణా దుకాణంలో కొన్న‌ మొక్కజొన్న గింజలు(కార్న్‌) తింటున్నారు. అజయ్ మొక్కజొన్న గింజలు తిన్న తర్వాత ఉమ్మివేసాడు. ఆజ‌య్ ఉమ్మిన చోట కొంత కార్న్ ఉంది. దీంతో 12 ఏళ్ల బాలుడు, అజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇద్దరు అబ్బాయిల మధ్య గొడవ జరిగింది. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడవ సమయంలో బాలుడు అజయ్‌ను అతని కాళ్ళ మధ్య అతని ప్రైవేట్ పార్ట్‌లో తన్నాడు. దీంతో అతను అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. ప్రజల సమాచారంతో బంధువులు అక్కడికి చేరుకుని అజయ్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.

కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించారు. పిల్లల మధ్య గొడవ జరిగిందని ఈస్ట్ జోన్ డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. కుటుంబ స‌భ్యులు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

అజయ్ తల్లి అనిత వికలాంగురాలు. కాగా తండ్రి సురేష్ చంద్ క్యాన్సర్‌తో ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. అన్నయ్య అతుల్ తన మేనమామతో కలిసి గర్హి మోహన్‌లాల్‌లో నివసిస్తున్నాడు. కుమారుడి మృతి సమాచారం తెలుసుకున్న తల్లి అనిత బోరున విలపించింది. చిప్స్ కొనుక్కోవాలని కొడుకు షాపుకు వెళ్లాడని తల్లి అనిత చెప్పింది.

గొడవలో ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాడ‌ని ఆరోపించిన 12 ఏళ్ల బాలుడి కుటుంబం షాక్‌కు గురైంది. ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి గొడవలు లేవని కాలనీ వాసులు తెలిపారు. అజయ్ మరణవార్త తెలిసి అత‌డు షాక్‌కు గురయ్యాడు. అతని పరిస్థితి చూసి అజయ్ బంధువులు.. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేదు.

Next Story