డ్రగ్స్ విక్రయదారులను పట్టుకునేందుకు చెన్నై పోలీసులు దాడులు నిర్వహించగా.. ఊహించని విధంగా ఓ మైనర్ బాలికను వారి నుండి రక్షించారు. బాలికను రూ.10 వేలకు వ్యాపారులకు విక్రయించినట్లు సమాచారం. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంట్లో ఉన్న డ్రగ్స్ వ్యాపారులను చుట్టుముట్టారు. నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న విశ్వనాథన్, నాగరాజ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మానసిక వికలాంగురాలైన తన తల్లి కోసం డబ్బు అవసరం అయిందని.. అందుకే కుటుంబ సభ్యులు తనను డ్రగ్స్ వ్యాపారులకు అమ్మేసినట్లు తెలిపింది. బాలిక మడిపాక్కంలోని ఓ ఇంట్లో పని చేస్తుండగా.. బలవంతంగా విశ్వనాథన్ ఇంటికి పంపించారు. రూ.10వేలు ఇచ్చి కొనుక్కున్నట్లు తెలిపారు.. బాలికపై అక్కడ పలుమార్లు అత్యాచారం చేశారు.
మైనర్‌పై విశ్వనాథన్ స్నేహితురాలు భారతి కూడా పలు సందర్భాల్లో దాడి చేసింది. గంజాయి విక్రయానికి సంబంధించి భారతి, హరిప్రసాద్, యువరాజ్, మణికందన్, కీర్తిరాజన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీల్లో 1.75 కిలోల గంజాయితోపాటు కత్తి, నాటు బాంబు, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.