బ్యాంకాక్ నుండి బతికి ఉన్న జంతువులను అక్రమంగా తీసుకువస్తున్న ఒక ప్రయాణికుడిని ఆగస్టు 11న చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విమానం నంబర్ TG-337లో బతికి ఉన్న జంతువులతో బ్యాంకాక్ నుండి వస్తున్న ఒక వ్యక్తి గురించి తమకు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ అందిందని అధికారులు తెలిపారు. వారు ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతని నుండి ఒక డి బ్రజ్జా కోతి, 15 కింగ్ స్నేక్స్, ఐదు బాల్ పైథాన్లు, రెండు అల్డబ్రా తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ జంతువులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్నారని, థాయ్ ఎయిర్‌వేస్ ద్వారా యానిమల్స్ క్వారంటైన్ & సర్టిఫికేషన్ సర్వీసెస్ (AQCS)తో సంప్రదించిన తర్వాత వాటిని తిరిగి స్వదేశానికి పంపించామని అధికారులు తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) ఆగస్ట్ 12న కొలంబో నుండి వచ్చిన ఇండిగో ఫ్లైట్ లో సోదాలు నిర్వహించారు. సీటు కింద దాచిపెట్టిన బంగారానికి సంబంధించిన భారీ ప్యాకెట్‌ని కనుగొన్నారు. కస్టమ్స్ విచారణలో 502 గ్రాముల బంగారు కడ్డీగా గుర్తించారు. వీటి ఖరీదు రూ. 23.26 లక్షలు ఉంది.