చార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్పద స్థితి

Chartered Accountant Suspicious Death. విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

By Medi Samrat
Published on : 21 Aug 2021 9:48 PM IST

చార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్పద స్థితి

విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చెరుకూరి సింధుది హత్యేన‌ని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సింధు సన్నిహితుడు ప్రసేన్ ఆమెను హత్య చేశాడని తల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా సింధు.. ప్రసేన్ తో సన్నిహితంగా ఉంటుంది. వీరిరువురి ప్రేమ వివాహానికి రెండు కుటుంబాల పెద్ద‌లు అంగీకరించలేదు. దీంతో లాక్‌డౌన్ అనంతరం సింధు.. ప్రసేన్ ఇంట్లోనే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో సింధుది హ‌త్యని మృతురాలి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. ఎంపీ కేశినేని నానిని కలిసిన బాధితులు.. న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఘ‌ట‌న‌పై పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సింధు తల్లిదండ్రులు తెలిపారు.


Next Story