టోల్‌ బూత్‌లోకి దూసుకెళ్లిన అంబులెన్స్‌.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Caught on CCTV, ambulance flips over, smashes into Karnataka toll booth, 3 killed. కర్నాకటలోని షిరూర్‌లో వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ అదుపు తప్పి టోల్‌ బూత్‌లోకి

By Medi Samrat
Published on : 20 July 2022 9:45 PM IST

టోల్‌ బూత్‌లోకి దూసుకెళ్లిన అంబులెన్స్‌.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

కర్నాకటలోని షిరూర్‌లో వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ అదుపు తప్పి టోల్‌ బూత్‌లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. టోల్ బూత్ కార్మికులు అంబులెన్స్ వెళ్లేందుకు మార్గాన్ని క్లియర్ చేస్తుండగా వాహనం తడి రోడ్డుపై నుంచి జారి టోల్ బూత్ లోకి దూసుకెళ్లింది. అంబులెన్స్ ఉడిపి జిల్లా హొన్నవర నుంచి కుందాపూర్‌కు వెళ్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌లో.. టోల్ ఆపరేటర్‌లుగా కనిపించిన వ్యక్తులు ఒక లేన్ నుండి మూడు ప్లాస్టిక్ బారికేడ్‌లను తొలగించడానికి పరిగెత్తడం కనిపించింది.

ఆపరేటర్‌లలో ఒకరు చివరి బారికేడ్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు అంబులెన్స్ దాదాపు టోల్ ప్లాజా వద్ద ఉన్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది. అయితే ఒక్క‌సారిగా అంబులెన్స్ టైర్లు జారి కంట్రోల్ అవ‌క‌ టోల్ బూత్ క్యాబిన్‌లోకి దూసుకెళ్లింది. "ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒకరు ఆసుపత్రిలో మరణించారు. అంబులెన్స్ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే నియంత్రణ కోల్పోయింది. మేము వాస్తవాలను ధృవీకరిస్తున్నాము. అంబులెన్స్ ప్రైవేట్ ఆసుపత్రికి చెందినది" అని ఉడిపి పోలీసు అధికారి తెలిపారు.










Next Story