ఏడాది కాలంగా నలుగురు బాలికలపై.. ప్రిన్సిపాల్‌ సహా ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారం

Case filed against 9 teachers, principal for raping, molesting 4 school students. స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు మరో ముగ్గురు టీచర్లు ఏడాది కాలంగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని

By అంజి  Published on  8 Dec 2021 6:22 AM GMT
ఏడాది కాలంగా నలుగురు బాలికలపై..  ప్రిన్సిపాల్‌ సహా ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారం

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నలుగురు విద్యార్థినులపై అత్యాచార వేధింపులకు పాల్పడినందుకు తొమ్మిది మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదైంది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాధితురాలి తండ్రి ప్రశ్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న బాధితురాలు తన స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు మరో ముగ్గురు టీచర్లు ఏడాది కాలంగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఈ చర్యకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారని కూడా ఆమె ఆరోపించింది. ఈ విషయానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంధాన పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ముఖేష్ యాదవ్ తెలిపారు.

పోలీసుల విచారణలో.. 6వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి చదువుతున్న మరో ముగ్గురు బాధితులు ముందుకు వచ్చి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులుపై తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితులు బెదిరించినట్లు బాధితులు తెలిపారు. విచారణ అనంతరం అల్వార్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌తో పాటు తొమ్మిది మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయులపై సామూహిక అత్యాచారం, వేధింపులకు పాల్పడ్డారని బాధితులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విషయాన్ని తాము మహిళా ఉపాధ్యాయులకు చెప్పినప్పుడు.. వారు తమ ఫీజులు, పుస్తకాల కోసం డబ్బులు చెల్లిస్తామంటూ బాలికలను ప్రలోభపెట్టారని బాధితుల్లో ఒకరు పోలీసులకు తెలిపారు. ఈ విషయంపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దని ఉపాధ్యాయులు కూడా కోరారు.

"దీని తర్వాత.. మేడమ్ నన్ను ముగ్గురు ఉపాధ్యాయుల ఇంటికి ప్రిన్సిపాల్‌తో సహా చాలాసార్లు తీసుకువెళ్లారు. టీచర్లందరూ ఇంట్లో మద్యం సేవించారు. తరువాత వారు నా బట్టలు విప్పి.. నాతో తప్పు చేసారు" ఓ బాధితురాలు చెప్పింది. కాగా ఘటనపై ఉపాధ్యాయురాలికి ఫిర్యాదు చేసేందుకు పాఠశాలకు వెళ్లగా.. తన సోదరుడు మంత్రి అని ప్రిన్సిపాల్‌ చెప్పాడని బాధితురాలి తండ్రి తెలిపారు. "ఫిర్యాదు చేస్తే చంపేస్తానని చెప్పాడు" అని తండ్రి చెప్పాడు. అన్ని ఆరోపణలను తోసిపుచ్చిన ప్రిన్సిపాల్, అలాంటి కేసు గురించి తనకు సమాచారం లేదని చెప్పారు.

Next Story