రూ.250 కోసం.. బస్ హెల్పర్ దారుణ హత్య
Bus helper killed for Rs 250 in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య ఘటన జరిగింది. ఓ మినీ బస్సు సహాయకుడిని క్రూరంగా హత్య చేశారు.
By అంజి Published on 20 Jan 2022 6:40 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య ఘటన జరిగింది. ఓ మినీ బస్సు సహాయకుడిని క్రూరంగా హత్య చేశారు. బాధితుడి నండి డబ్బు దోచుకునే ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో నిందితులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు. దీపక్ అనే బాధితుడు బుధవారం నాడు ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో బస్సులో శవమై కనిపించాడని పోలీసులు తెలిపారు. నిందితులను ఫైజ్ ఉల్ రెహ్మాన్ (20), మహ్మద్ ఫరాజ్ (18)గా గుర్తించి గురువారం అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోపిడీకి పాల్పడే సమయంలో దీపక్‌పై పేపర్ కట్టర్‌తో దాడి చేయడంతో పాటు అతని గొంతుపై గాయం కావడంతో అతడు మృతి చెందాడు.
నిందితులు ఇద్దరు డ్రగ్స్ బానిసలు. డ్రగ్స్ కొనేందుకు దోపిడీకి ప్రయత్నించారని.. దీపక్ నుంచి సుమారు రూ. 5000 పొందవచ్చని, అయితే అతని వద్ద కేవలం రూ. 250 మాత్రమే దొరికాయని పోలీసులు తెలిపారు. దీపక్ గత పదేళ్లుగా మినీబస్సులో హెల్పర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. నిందితులు మొదట పేపర్ కట్టర్‌తో దీపక్‌ను బెదిరించారు. అతను ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు అతని మెడను కోసి 250 రూపాయలు లాక్కెళ్లారు. "బస్సు లోపల విశ్రాంతి తీసుకుంటున్న బాధితుడు దీపక్ గాయపడిన స్థితిలో కనిపించాడని, ఊపిరి పీల్చుకోవడం లేదని మాకు బుధవారం ఉదయం 10.44 గంటలకు కాల్ వచ్చింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు.