సొంత సోదరులే ఆమె ప్రాణాలు తీశారు

Brothers killed their own sister together. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో గతేడాది ఓ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది.

By Medi Samrat  Published on  2 March 2022 12:01 PM GMT
సొంత సోదరులే ఆమె ప్రాణాలు తీశారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో గతేడాది ఓ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె సోదరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరువు తీసిందంటూ చాలా కోపంతో గడుపుతూ ఉన్నారు. తన సోదరి ప్రేమ పెళ్లిపై కోపంతో ఉన్న సోదరులు ఎట్టకేలకు హతమార్చారు. 21 ఏళ్ల యువతిని కాల్చి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్మాయి గ్రామంలో ఇద్దరు సోదరులు వారి సోదరిని కాల్చి చంపారని బదౌన్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ OP సింగ్ తెలిపారు. భర్త ఫహీమ్‌తో ఉన్న యువతిని చూసిన ఆమె సోదరులు ఆగ్రహంతో రగిలిపోయారు.

ఆ యువతి 18 నెలల క్రితం తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఫహీమ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు సింగ్ తెలిపారు. దీంతో ఆమె ఇద్దరు సోదరులు కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల యువతి తన భర్తతో కలిసి మందులు కొనేందుకు తన గ్రామం నుంచి బదౌన్‌కు వెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆమె మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె సోదరులు ఆమెను చూశారు. తుపాకీతో ఆమెపై వెనుక నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఇద్దరు సోదరులపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు.


Next Story
Share it