ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చంపేస్తానని బెదిరించి తనపై బావ పలుమార్లు అత్యాచారం చేశాడని వితంతువైన మహిళ ఆరోపించింది. తనను బెదిరించి అతడు పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితుడు షోయబ్ సైఫీని సెక్టార్-63 నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. షోయబ్ ఛిజార్సీలోని సెక్టార్-63 నివాసం ఉంటూ ఉండేవాడు. జనవరి 17, 2020న, బాధితురాలి భర్త మరణించాడు. ఆ తర్వాత షోయబ్ తన ఆమెను నిరంతరం బెదిరిస్తూ వచ్చాడు. ఒంటరిగా ఉండటం వల్ల ఆమెను చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. బాధితురాలు పలుమార్లు షోయబ్ సైఫీ ని అడ్డుకోవాలని ప్రయత్నించినా.. అతడి బెదిరింపుల కారణంగా మౌనంగా ఉండిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న షోయబ్ సైఫీ ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు.
చివరికి బాధితురాలు ధైర్యం తెచ్చుకుని నోయిడా పోలీసుల వద్ద తన ఫిర్యాదును నమోదు చేసింది. ఆ తర్వాత పోలీసులు షోయబ్ సైఫీని అరెస్టు చేసి జైలుకు పంపారు. మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.