ఆదివారం నాడు వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను టిప్పర్‌ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అన్నా చెల్లెలు దుర్మరణం చెందారు. పూరి వివరాల్లోకి వెళ్తే.. ఓ పెళ్లి వేడుకకు హాజరై స్వగ్రామానికి బైక్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఖానాపురం మండలం దబ్బిర్‌పేట గ్రామానికి చెందిన మొగుళ్లపల్లి రాకేష్‌ బాబు, ప్రసన్నలుగా తెలిసింది. వీరిద్దరూ అన్నా చెల్లెలు. బైక్‌పై అన్నా చెల్లెలు నర్సంపేట మండలం లక్నెపల్లి దగ్గరకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పిర్‌ లారీ ఢీ కొట్టింది.

దీంతో అన్నా చెల్లెలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నా చెల్లెల మృతితో దబ్బిర్‌పేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్‌ లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story