ప్రేమించిన యువతిపై అత్యాచారం, హత్య.. కరీంగనర్‌ జిల్లాలో ఘటన.. విస్తుపోయే నిజాలు

Boyfriend who killed girlfriend in Karimnagar district. ప్రేమ అంటూ వెంటబడ్డాడు. నెలల తరబడి తిరుగుతూ యువతిని నమ్మించాడు. నమ్మిన ఆ యువతి అతడిని ప్రేమించింది.

By అంజి  Published on  9 Jan 2022 7:59 AM IST
ప్రేమించిన యువతిపై అత్యాచారం, హత్య..  కరీంగనర్‌ జిల్లాలో ఘటన.. విస్తుపోయే నిజాలు

ప్రేమ అంటూ వెంటబడ్డాడు. నెలల తరబడి తిరుగుతూ యువతిని నమ్మించాడు. నమ్మిన ఆ యువతి అతడిని ప్రేమించింది. చివరకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొమ్మని నిలదీనసినందుకు యువతిని దారుణంగా హతమర్చాడు యువకుడు. ఈ ఘటన కరీంగనర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల పరిధిలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్నెంపల్లికి చెందిన యువతి (19) ఇంటర్మీడియట్‌ చదువుతోంది. కొన్నాళ్లుగా ఇంటి వద్దే ఉంటోంది. చిన్నవయసులోనే మానస (పేరు మార్చబడింది) దత్తత తీసుకున్న ఏడెల్లి పోచమ్మ, రవి దంపతులు పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులకు మేకలు ఉన్నాయి. వాటిని మానస తరచుగా మెపడానికి వెళ్లేది.

ఈ క్రమంలోనే జనవరి 2వ తేదీన మేకలు మేపడానికి వెళ్తున్నానని ఇంటి దగ్గర చెప్పి బయటకు వెళ్లింది. రాత్రి అయినా మానస ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 5వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మానసతో పరిచయం ఉన్న పొరండ్ల గ్రామానికి చెందిన అఖిల్‌ను తమదైన శైలిలో అడిగారు. దీంతో యువతి మానసను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

ఆమెన హత్య చేసిన స్థలానికి పోలీసులను తీసుకెళ్లాడు. చెంజర్ల సమీపంలోని గుట్ట దగ్గర యువతి శవమై కనిపించింది. కుళ్లిపోవడంతో మృతదేహం నుండి దుర్వాసన వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు.. ఘటనా స్థలంలోని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో చున్నీతో హత్య చేశానని నిందితుడు అఖిల్‌ ఒప్పుకున్నాడు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Next Story