ముగ్గురు పిల్లల తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని
Boyfriend poured petrol on his girlfriend and set her on fire.. Incident in Bihar. జార్ఖండ్ దుమ్కా లాంటి ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలి
By అంజి Published on 17 Dec 2022 3:43 PM ISTజార్ఖండ్ దుమ్కా లాంటి ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ప్రియురాలు తీవ్రంగా కాలిపోయింది. ప్రియురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేస్తున్నాడు. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని మోతీహరిలోని కళ్యాణ్‌పూర్‌లో జార్ఖండ్‌కు చెందిన దుమ్కా లాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రేమికుడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అరుపులు విని బంధువులు, ఇరుగుపొరుగు వారు ఆమెను కాపాడారు. వారు వెంటనే మంటలను ఆర్పి మహిళను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలిపై నిందితుడు ఒత్తిడి చేస్తున్నాడని సమాచారం.
గురువారం రాత్రి ఆ మహిళ మోతీహరిలోని కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో వంట చేస్తోంది. అదే సమయంలో ఘోరసహన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే డానిష్ అనే యువకుడు అక్కడికి చేరుకున్నాడు. యువతి, డానిష్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు. యువతి ఇంటికి చేరుకున్న దానిష్ పెళ్లి కోసం ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహంతో డానిష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విన్న మహిళ బంధువులు, ఇరుగుపొరుగు వారు వచ్చారు. వెంటనే మంటలను ఆర్పి మహిళను కళ్యాణ్‌పూర్ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మోతీహరికి రిఫర్ చేశారు.
బాధిత మహిళ, డానిష్ మధ్య గత ఏడాదిన్నరగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నిందితుడు డానిష్ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ప్రియురాలికి వివాహమైంది, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త సంపాదన కోసం బయటకు వెళ్లాడు. దీంతో ఆ మహిళ పెళ్లికి నిరాకరించింది. పెళ్లికి నిరాకరించడంతో డానిష్ ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సంఘటన తర్వాత కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వివేక్ కుమార్ నిందితుడు డానిష్‌ను అరెస్టు చేశారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మోతిహారి ఎస్పీ డా.కుమార్ ఆశిష్ మాట్లాడుతూ... ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయం. గత రెండున్నరేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే చర్చ తెరపైకి వస్తోంది. ఆ మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ప్రియుడు ఆమెను కలవడానికి ఇంటికి వచ్చాడు, ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది అని చెప్పారు.