గర్ల్ ఫ్రెండ్ ను చంపి అడవిలోకి పారిపోయిన ప్రియుడు

boyfriend killed girlfriend. ఛత్తీస్ఘర్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ప్రియురాలిని ఓ ప్రేమికుడు హత్య చేసిన ఘటన

By Medi Samrat  Published on  8 Dec 2021 11:10 AM GMT
గర్ల్ ఫ్రెండ్ ను చంపి అడవిలోకి పారిపోయిన ప్రియుడు

ఛత్తీస్ఘర్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ప్రియురాలిని ఓ ప్రేమికుడు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని.. ఆ గొడవ కాస్తా హత్యకు దారితీసినట్లు సమాచారం. దీంతో ఆ ప్రేమికుడు ప్రేయసి హత్యకు పాల్పడ్డాడు. ప్రియుడు, ప్రేయసి గొంతు నులిమి, తలను గట్టిగా బాది బాలికను హతమార్చాడు. నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా మోనికా మండల్‌తో సుజన్‌ మాలిక్‌కు సంబంధం ఉన్నట్లు వెల్లడైంది.

పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అడుగుతున్నా.. గత కొద్ది నెలలుగా దాటవేస్తూఉన్నాడు. హత్య జరగ ముందు కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. హత్యకు గురైన అమ్మాయి మొదట బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ గొడవ తీవ్రంగా మారడంతో ఆమెను సుజన్ చంపేశాడు. మోనికాను చంపిన తరువాత, అతను అడవి వైపు పరుగెత్తాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అడవిలో దాక్కున్న నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మోనికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


Next Story
Share it