గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం.. ముఖంపై యాసిడ్ పోసి చంపిన ప్రియుడు

Boyfriend killed 20 year old girl in jharkhand burnt face with acid. జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో 20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.

By అంజి  Published on  27 Nov 2022 1:36 PM IST
గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం.. ముఖంపై యాసిడ్ పోసి చంపిన ప్రియుడు

జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో 20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. యువతి గుర్తింపును చెరిపేసేందుకు ఆమె ముఖాన్ని యాసిడ్‌తో కాల్చాడు. హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీప్ నారాయణ్ సింగ్ అలియాస్ చర్కు అనే నిందితుడిని అరెస్టు చేశారు. యువతి రాంచీలోని ఓ కాలేజీలో పీజీ చదువుతోంది. యువతి గత కొన్ని నెలలుగా దీప్ నారాయణ్‌తో టచ్‌లో ఉంది. గత ఆదివారం దీప్ నారాయణ్‌తో కలిసి వెళ్లింది. అప్పటి నుంచి యువతి కనిపించకుండా పోయింది.

దీప్ నారాయణ్ యువతిని హత్య చేసి, మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని రాతి క్వారీల సమీపంలోని ఒక నిర్జన ప్రదేశంలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. యువతిని గుర్తించకుండా ఉండేందుకు ఆమె ముఖంపై యాసిడ్ లాంటిది పోయడంతో ముఖం కాలిపోయింది. యువతి దుస్తులను బట్టి తల్లిదండ్రులు గుర్తించారు. ప్రాథమికంగా చూస్తే యువతిని అత్యాచారం చేసిన తర్వాతే నిందితుడు హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చేతులు, మెడపై గాయం గుర్తులు కనిపించాయి. దీప్ నారాయణ్ అలియాస్ చర్కు.. యువతిని హత్య చేసినట్లు బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హత్యకు ముందు అత్యాచారం జరిగింది.

నవంబరు 22న విద్యార్థి మృతదేహం లభ్యమైందని లోహర్‌డగా ఎస్పీ ఆర్‌ రామ్‌కుమార్‌ తెలిపారు. ఆ తర్వాత దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు దీప్ నారాయణ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య రిలేషన్‌ షిప్‌ ఉండేదని, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని చెప్పారు. హత్యకు ముందు జరిగిన రేప్ పాయింట్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నుంచి యువతి విద్యార్హత పత్రాలు సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Next Story