ఆంటీని కత్తెరతో పొడిచి చంపిన బాలుడు.. ఆ విషయంలో ఒత్తిడి తేవడంతో..

Boy stabs aunt to death after she forces him to elope with her. మేనమామ భార్యను 17 ఏళ్ల బాలుడు కత్తెరతో కసితీరా పొడిసి హత్య చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటు

By అంజి  Published on  23 Oct 2021 8:42 AM GMT
ఆంటీని కత్తెరతో పొడిచి చంపిన బాలుడు.. ఆ విషయంలో ఒత్తిడి తేవడంతో..

మేనమామ భార్యను 17 ఏళ్ల బాలుడు కత్తెరతో కసితీరా పొడిసి హత్య చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో ఓ మహిళ 17 ఏళ్ల వయస్సు గల బాలుడితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మహిళ ఇంటికి బాలుడు వచ్చాడు. దీంతో ఇద్దరం కలిసి ఎక్కడికైనా పారిపోదామని బాలుడిని ఆ మహిళ ఒత్తిడి చేసింది. ఇందుకు బాలుడు నిరాకరించాడు. దీంతో బాలుడిపై మహిళ కత్తెరతో దాడికి యత్నించింది. ఆగ్రహించిన బాలుడు మహిళ చేతిలోకి కత్తెర లాక్కొని ఆపై దాడి చేశాడు. కత్తెరతో కసితీరా పొడిచి చంపాడు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లోని బెడ్‌షీట్‌ నిప్పంటించిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళ ఇంటి నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటన జరిగిన ఇంటికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడిఉన్న మహిళను గుర్తించారు. మహిళ మృతదేహంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన సమయంలో మహిళ భర్త ఆఫీసులో ఉన్నాడని తెలిసింది. మహిళను భర్తను పోలీసులు విచారించగా.. తన అల్లుడితో భార్య వివాహేతర సంబంధం నడుపుతోందని, ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆమెతో గొడవపడుతున్నానని తెలిపాడు. భార్య వ్యవహారంతో తాను పిల్లలను వారి తాత ఇంటి వద్ద ఉంచానన్నాడు. భర్తకు వివాహేతర సంబంధం గురించి తెలియడంతోనే.. ఎక్కడికైనా వెళ్లిపోదామంటూ బాలుడిని మహిళ ఒత్తిడి తీసుకువచ్చిందని పోలీసులు తెలిపారు. బాలుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోంకు తరలించారు.

Next Story
Share it