ఎండలో బయటకు వెళ్లొద్ద‌న్న తల్లి.. 9 ఏళ్ల బాలుడు ఆత్మ‌హ‌త్య‌

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

By Medi Samrat  Published on  31 May 2024 7:57 PM IST
ఎండలో బయటకు వెళ్లొద్ద‌న్న తల్లి.. 9 ఏళ్ల బాలుడు ఆత్మ‌హ‌త్య‌

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దుగ్గొండి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మైసంపల్లి గ్రామానికి చెందిన సిద్ధు (9) గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు అతని తల్లి గుర్తించింది.

కొడుకును బయటికి వెళ్లవద్దని చెప్పి.. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వ‌చ్చి చూసే సరికి బాలుడు ఉరివేసుకుని పడి ఉన్నాడు. బాధితురాలి మేనమామ దుంగొండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు కొనసాగుతోంది.

మరో ఘటనలో తొమ్మిదేళ్ల హర్ష వర్ధన్ అనే బాలుడు.. న‌చ్చిన హెయిర్‌కట్ చేయించేందుకు తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామంలో ఈనెల 26న చోటుచేసుకుంది.

Next Story