16 ఏళ్ల బాలుడిని బట్టలు లేకుండా పూజలు చేయమని బలవంతం చేసినందుకు కర్ణాటక పోలీసులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కొప్పల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవుడికి నగ్నంగా పూజలు చేస్తే తండ్రి అప్పులు తీరుతాయని ముగ్గురు నిందితులు బాలుడిని నమ్మించారు.
తన తండ్రి అప్పులు తీరాలంటే ఈ పని చేయాలని నిందితులు బాలుడికి చెప్పారు. నగ్న స్థితిలో పూజలు చేసిన వెంటనే అతని కుటుంబానికి డబ్బు వస్తుందని వారు అతనికి హామీ ఇచ్చారు. అనంతరం వారు బాలుడిని హుబ్బళ్లి నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి నగ్న స్థితిలో దేవుడికి పూజలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను శరణప్ప, విరూపనగౌడ్, శరణప్ప తలవారగా గుర్తించారు. వీరు మొత్తం ఎపిసోడ్‌ను ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయి.
వీడియోలు ప్రచారం అవుతున్నాయని తెలుసుకున్న బాలుడు.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం నిందితులపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయగా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.