దారుణం.. గర్భిణి సోదరి తల నరికి.. తలతో సెల్ఫీలు దిగిన 18 ఏళ్ల బాలుడు

Boy beheads pregnant sister, takes selfies with severed head in maharashtra. మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ సోదరిని తల నరికి అతి దారుణంగా హత్య చేశాడు ఓ 18 ఏళ్ల బాలుడు.

By అంజి  Published on  6 Dec 2021 9:23 AM GMT
దారుణం.. గర్భిణి సోదరి తల నరికి.. తలతో సెల్ఫీలు దిగిన 18 ఏళ్ల బాలుడు

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ సోదరిని తల నరికి అతి దారుణంగా హత్య చేశాడు ఓ 18 ఏళ్ల బాలుడు. ఈ దారుణ ఘటన ఔరంగాబాద్‌ జిల్లా పరిధిలో జరిగింది. తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 19 ఏళ్ల గర్భిణీ స్త్రీని ఆదివారం తల్లి సహాయంతో ఆమె సోదరుడు తల నరికి చంపాడు. జాతీయ దినపత్రిక కథనం మేరకు.. 38 ఏళ్ల తల్లి, 18 ఏళ్ల సోదరుడు బాధితురాలిని చంపిన తర్వాత ఆమె తలను బయటకు తీసుకువచ్చి అందరి ముందు ప్రదర్శించారు. తమ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే తమ కుమార్తెను చంపేశామని తల్లి ఇరుగుపొరుగు వారికి కూడా చెప్పినట్లు పోలీసుల చెప్పారు. ఆరు నెలల క్రితం యువతి వివాహం చేసుకుంది.

కాగా 18 ఏళ్ల బాలుడు తన సోదరి తలతో సెల్ఫీలు కూడా దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి, సోదరుడు ఆమెతో రాజీ కుదుర్చుకునే నెపంతో ఆమె ఇంటికి వెళ్లారు. గర్బిణీ, ఆమె సోదరుడు, తల్లి ఏకాంతంగా మాట్లాడుకునేందుకు వీలుగా ఆ గర్బిణీ భర్త గది నుంచి వెళ్లిపోయాడు. మహిళ టీ చేయడానికి వంటగదికి వెళ్లగా, పదునైన ఆయుధంతో వచ్చిన సోదరుడు ఆమెపై దాడి చేసి గొంతు కోశాడని పోలీసు అధికారులు తెలిపారు. భర్త ఆమెను రక్షించే సమయానికి బాధితురాలి సోదరుడు ఆమె తల నరికి చంపాడని వారు తెలిపారు. తనపై కూడా దాడి జరుగుతుందనే భయంతో బాధితురాలి భర్త ఇంటి నుంచి పారిపోయాడు. తల్లి, సోదరుడు విర్గోన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నేరం అంగీకరించారు. వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it