జార్ఖండ్ రాజధాని రాంచీలోని లాల్‌పూర్‌లోని ఓ మాల్ వాష్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నారనే వార్త కలకలం సృష్టించింది. వాష్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న వ్యక్తిని మొదట పారిశుధ్య కార్మికులు చూశారు. అనంతరం అధికారులకు, షాపింగ్ మాల్ కు వచ్చిన వ్యక్తులకు విషయం తెలిసింది. దీంతో మాల్ మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మాల్‌కు చేరుకున్న పోలీసులు వాష్‌రూమ్‌లో నేలపై పడి ఉన్న వ్యక్తిని గుర్తించారు. ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని పోలీసులు భావించి ఫోరెన్సిక్ బృందానికి సమాచారం అందించారు. ఫోరెన్సిక్ బృందం వచ్చేలోపు వాష్‌రూమ్‌లో పడి ఉన్న వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఆ వ్యక్తికి స్పృహ వచ్చిన తర్వాత పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆ వ్యక్తి పేరు రాహుల్ కుమార్. తన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు సోమవారం మాల్‌కు వచ్చాడు. రాహుల్ తన స్నేహితులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు సినిమా మధ్యలో వచ్చేశాడు. రాహుల్ ఇద్దరు స్నేహితులు సినిమా చూసి బయటకు వచ్చేసరికి రాహుల్ ఎక్కడా కనిపించలేదు. రాహుల్ స్నేహితులు కూడా మాల్ సిబ్బందిని ఆశ్రయించారు, కానీ వారికి వారి వైపు నుండి ఎటువంటి సహాయం లభించలేదు. మంగళవారం ఉదయం వాష్‌రూమ్‌ను శుభ్రం చేసే వారు.. రాహుల్ వాష్‌రూమ్‌లో పడుకుని ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించారు. అతడు అలా పడి ఉండడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.