ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత కుమార్తె

BJP leader's daughter commits suicide. మాజీ ఎంపీ మంత్రి, బీజేపీ నేత మోతీ కశ్యప్ కుమార్తె 42 ఏళ్ల త్రిప్తి పాట్లే ఉరి వేసుకుని

By Medi Samrat  Published on  8 Jan 2022 4:12 PM IST
ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత కుమార్తె

మాజీ ఎంపీ మంత్రి, బీజేపీ నేత మోతీ కశ్యప్ కుమార్తె 42 ఏళ్ల త్రిప్తి పాట్లే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడు తన కూతురిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అందుకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మోతీ కశ్యప్ ఆరోపించారు. తృప్తి ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. త్రిప్తి 2017లో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మహేష్ పాట్లేతో ప్రేమ వివాహం చేసుకుంది. త్రిప్తికి సంతానం లేదని పాట్లే కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే ఆమె ఆందోళన చెందుతూ ఉండేది. మహేష్ తనను వేధించాడని త్రిప్తి తన సోదరీమణులతో చెప్పిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహేశ్ పాట్లే మైనింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. తమ కుటుంబం మాత్రం ఆమెను ఎవరూ హింసించలేదని మహేష్ తెలిపాడు. కేసు దర్యాప్తులో ఉందని ఆధార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శైలేష్ మిశ్రా తెలిపారు. మోతీ కశ్యప్ కుమార్తె త్రిప్తి షాపురా కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత త్రిప్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులకు ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు.


Next Story