కోట్లు కొల్లగొట్టి 27 నెలలుగా తప్పించుకుని తిరిగిన క్రిమినల్ అరెస్ట్
Bihar Police arrests notorious criminal after 27 months for looting crores. బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్థుడు రవిగుప్తాను.. 27 నెలల తర్వాత శనివారం నాడు
By Medi Samrat Published on 28 March 2022 1:48 PM IST
బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్థుడు రవిగుప్తాను.. 27 నెలల తర్వాత శనివారం నాడు నలందలో పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ పోలీసులు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పోలీసులు గత 27 నెలలుగా అతని కోసం వెతుకుతున్నారు. 3 రాష్ట్రాల పోలీసులు రవిని కనిపెట్టడంలో నిమగ్నమై ఉన్నారు. రవి గుప్తా ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకుంటూ బ్రతుకుతున్నాడు. రవి రహస్య స్థావరం రాంచీలో ఉండడంతో దానిపై పోలీసులు దాడి చేశారు.
2019లో రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆషియానా ప్రాంతానికి చెందిన పంచవటి రత్నాలయలో 5 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకుని తన సహచరులతో కలిసి పారిపోయాడు. అయితే 9 రోజుల తరువాత పోలీసులు రవిని మరియు అతని సహచరులను వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేసి బీర్ జైలుకు పంపారు. 6 నెలల పాటు అక్కడే ఉండి స్నేహితులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్న రవి పశ్చిమ బెంగాల్‌లో దోపిడీకి పాల్పడ్డాడు. రవి గుప్తా పరారీలో ఉండి నలందలోని సోహ్సరాయ్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సివిల్ డ్రెస్‌లో వెళ్లి అతడిని పట్టుకున్నారు.
రవి గుప్తా ను STF పాట్నా పోలీసులకు అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. అతనిపై పిర్బహోర్ పోలీస్ స్టేషన్‌లోని సివిల్ కోర్టు నుండి పారిపోవడం, రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని పంచవటి జ్యువెలర్స్‌లో నగలు దోచుకోవడం, అలమ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధాల చట్టం కింద, బైపాస్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ మొదలైన కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గార్డ్నిబాగ్ ప్రాంతంలో దోపిడీ సమయంలో ఒకరు కాల్చి చంపబడ్డారు. రాజ్ ట్రేడర్స్ యజమాని బంటీ గుప్తా హత్యలో రవి గుప్తా పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇది కాకుండా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అనేక భారీ నగల దోపిడీల వెనుక ఉన్నది కూడా రవినే అని భావిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ పోలీసులు కూడా అతడి కోసం వెతుకుతున్నారు. అక్కడ కూడా అనేక దోపిడీ ఘటనలలో ఇతడిని నిందితుడిగా భావిస్తూ ఉన్నారు.
రవిగుప్తా అరెస్టును ఎస్టీఎఫ్ ఎస్పీ ధృవీకరించారు. రవి గుప్తా నిజానికి పాట్నాలోని అలమ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సాదిక్‌పూర్ ప్రాంతంలో నివాసి. కానీ అతడు వివిధ పేర్లతో ప్రజలకు తెలుసు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రూపురేఖలు మార్చడంలో నిపుణుడు. పట్నా పోలీసుల బృందం రిమాండ్‌లో తీసుకుని పలు కేసుల్లో విచారించవచ్చు. ఇది కాకుండా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా అతన్ని విచారణ కోసం రిమాండ్‌కు తీసుకెళ్లవచ్చు.