పదునైన ఆయుధంతో ప్రైవేట్ భాగాన్ని నరికేసుకున్న వ్య‌క్తి

Bihar man chops off his private part. భార్య తన పుట్టింటికి వెళ్లిపోవడంతో బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తన ప్రైవేట్ భాగాన్ని కోసుకున్నాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 21 Jan 2023 8:30 PM IST

పదునైన ఆయుధంతో ప్రైవేట్ భాగాన్ని నరికేసుకున్న వ్య‌క్తి

భార్య తన పుట్టింటికి వెళ్లిపోవడంతో బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తన ప్రైవేట్ భాగాన్ని కోసుకున్నాడు. బీహార్‌లోని మాధేపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రజనీ నయానగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మహేంద్ర బసుకి కుమారుడు కృష్ణ బసుకి (25) అనే వ్యక్తికి.. లాల్ బాసుకి కుమార్తె అనితతో వివాహం చేశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా నలుగురు సంతానం.

కృష్ణ పంజాబ్‌లోని మండిలో ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రెండు నెలల క్రితం రజనీ నయానగర్‌లోని తన కుటుంబాన్ని చూసేందుకు వచ్చాడు. అతని భార్య అనిత తన తల్లిదండ్రుల దగ్గరే ఉండడం.. ఇంటికి తిరిగి రాకపోవడంతో కోపోద్రిక్తుడైన కృష్ణ పదునైన ఆయుధంతో తన ప్రైవేట్ భాగాన్ని నరికేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. కృష్ణకు చికిత్స అందిస్తున్నారని, ప్రాణాపాయం లేదని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో డాక్టర్ సుకేష్ కుమార్ తెలిపారు. కృష్ణ మానసిక సమస్యలతో సతమవుతూ ఉన్నాడని బంధువులు తెలిపారు.

Next Story