ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
ఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది
By Medi Samrat Published on 14 May 2024 7:36 AM ISTఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో కారు చిన్నాభిన్నం కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చాలాసేపు శ్రమించి అందరినీ బయటకు తీయాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ నుంచి మొరాదాబాద్ వైపు కారు వెళ్తోంది. కారు అల్లాభక్ష్‌పూర్ టోల్‌ప్లాజాకు చేరుకోగానే అతివేగం కారణంగా ఒక్కసారిగా అదుపు తప్పింది. కారు డివైడర్‌ను దాటి హైవే అవతలి వైపుకు పడి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారు ఒక్కసారిగా ఎగిరిపడటంతో కారులో ఉన్నవారు అందులోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి కారులోని వ్యక్తులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందినవారిని అనుపమ్, అంకిత్, జీతూ, శంకర్, సందీప్‌గా గుర్తించారు. మరో గుర్తు తెలియని వ్యక్తి కూడా మరణించిన వారిలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో మీరట్‌లోని దలుహెరా నివాసి సచిన్ తీవ్రంగా గాయపడగా.. అతన్ని మీరట్‌కు తరలించారు. మృతులు ఘజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన వారు. మృతుల వయస్సు 30 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అందరూ ఘజియాబాద్ నుండి మొరాదాబాద్ వెళ్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.