అశ్లీల వెబ్‌సైట్‌లలో సొంత వీడియోలు చూసి షాకైన యువకుడు.. ఏం జరిగిందంటే..
Bengaluru man gets shock of his life, finds own video on porn sites. బెంగళూరులో 25 ఏళ్ల యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు
By Medi Samrat Published on 31 Jan 2022 7:00 PM IST
బెంగళూరులో 25 ఏళ్ల యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు వివిధ అశ్లీల వెబ్‌సైట్‌లలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో అతడు వెంటనే పోలీసులను సంప్రదించాడు. రాష్ట్ర సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ క్రైమ్ (CEN) పోలీసుల కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు, BPO ఉద్యోగి ఆస్టిన్ టౌన్ లో నివాసి అతని స్నేహితురాలితో కలిసి కొన్ని వారాల క్రితం హోటల్‌లో బస చేశాడు. వారు హోటల్‌లో ఉన్న సమయంలో వారి ప్రైవేట్ క్షణాలను కొందరు గుర్తు తెలియని దుండగులు కెమెరాలో బంధించారు. ఆ వీడియోను పోర్న్ సైట్‌లలో కూడా అప్‌లోడ్ చేశారు.
జనవరి 21న బాధితుడు తన ప్రైవేట్ వీడియోను పలు పోర్న్ వెబ్‌సైట్లలో చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియోలో, ఫిర్యాదుదారు, అతని స్నేహితురాలి ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి. అతను తన ఛాతీపై పుట్టిన గుర్తుతో సహా కొన్ని భౌతిక లక్షణాలను గుర్తించాడు. జనవరి 24న పోలీసులను సంప్రదించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. పోర్న్ సైట్‌లో దొరికిన వీడియోను వివిధ కోణాల్లో చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని నేరగాళ్లపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి మరో కేసులో పోర్న్‌కు బానిసై కాల్ గర్ల్స్‌పై డబ్బు ఖర్చు చేసే భర్త అలవాట్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తాను వేధింపులకు గురయ్యానని బెంగళూరుకు చెందిన ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. 36 ఏళ్ల బాధితురాలు 2019లో పెళ్లి తర్వాత తన భర్త పోర్న్‌కు అలవాటు పడ్డాడని తెలుసుకుంది. అతను రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో ఆన్‌లైన్ చాట్‌లలో పాల్గొనేవాడని ఆమె కనుగొంది. తన భర్త తన చిత్రాలను కూడా కాల్ గర్ల్స్‌తో పంచుకున్నాడని తెలిపింది. అతడి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనను వేధించాడని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరపాలని బసవనగుడి మహిళా పోలీసులను కోర్టు ఆదేశించింది.