సిబ్బందితో పోలీసులపై దాడి చేసిన బార్ యజమాని

Bar owner, 9 others held for assaulting 8 cops during raid. హౌజ్ ఖాస్ విలేజ్ లోని ఒక బార్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది

By Medi Samrat  Published on  25 July 2022 4:23 PM IST
సిబ్బందితో పోలీసులపై దాడి చేసిన బార్ యజమాని

న్యూ ఢిల్లీ: హౌజ్ ఖాస్ విలేజ్ లోని ఒక బార్‌లో జరిగిన దాడిలో ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. ఓ బార్ యజమాని, అతని తొమ్మిది మంది ఉద్యోగులు రాడ్‌లు, కర్రలు, పైపులతో పోలీసులపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, పోలీసులు బార్ యజమానితో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ విలేజ్ లో ఉన్న డౌన్‌టౌన్ క్లబ్‌లో జూలై 20-21 మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. FIR ప్రకారం, సౌత్ డిస్ట్రిక్ట్ పోలీసు ప్రత్యేక సిబ్బందికి హౌజ్ ఖాస్ గ్రామ ప్రాంతంలో అక్రమ డిస్కోథెక్‌లు, హుక్కా బార్‌లు ఫుల్ సౌండ్ తో నడుపుతున్నట్లు సమాచారం అందింది. సీనియర్ అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి.. ఆ బార్‌లపై దాడి చేయాలని ఆదేశించారని స్పెషల్ స్టాఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ లో ఉంది. అనంతరం హౌజ్ ఖాస్ గ్రామంలోని మూడు అంతస్తుల్లో మూడు బార్లు నడుపుతున్న భవనంపై పోలీసులు దాడి చేశారు. "మేము డౌన్‌టౌన్ బార్‌లోకి ప్రవేశించినప్పుడు, అక్కడ మద్యం సేవించి, హుక్కా తాగుతూ, బిగ్గరగా సంగీతానికి డ్యాన్స్ చేస్తున్న 20-30 మంది వ్యక్తులు గుమిగూడారు" అని పోలీసు అధికారులు తెలిపారు. యజమానిని సంబంధిత లైసెన్సుల కోసం అడిగారు. సదరు వ్యక్తి లైసెన్సులు చూపించకుండా పోలీసులపై అరవడంతోపాటు దుర్భాషలాడాడని అధికారులు ఆరోపించారు.

పోలీసులని తొమ్మిది మంది సిబ్బంది.. బార్ నుండి బయటకు నెట్టడం మొదలుపెట్టారు. పోలీసులు వారి మాట వినకపోవడంతో.. తొమ్మిది మంది వ్యక్తులు పోలీసులపై బల్లలు, కుర్చీలు, సీసాలు విసిరారు. కొందరు పోలీసులను రాడ్లు, కర్రలు, స్టీల్ పైపులతో కొట్టారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "దాడి జరిగిన స్థలం ఇప్పుడు మూసివేయబడింది. ఇంకా విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.












Next Story