విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఫెర్రీవీధిలో వాలంటీర్ అయిన ఓ యువతిపై శ్రీకాంత్ అనే మరో వాలంటీర్ కత్తితో దాడి చేశాడు. యువతిని మెడపై కత్తితో పొడిచిన శ్రీకాంత్ అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
గమనించిన స్థానికులు.. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. యువతి మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.