భూతవైద్యం చేసే మహిళపై ప్రియుడు హత్యాచారం.. ఆ విషయంచెప్పి గుట్టపైకి తీసుకెళ్లి..!

Arrest of boyfriend who murdered a married woman. తనను దూరం పెట్టిందని ఓ వివాహితను గుట్టపైకి తీసుకెళ్లి ఆమె ప్రియుడే అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడని

By అంజి  Published on  3 Nov 2021 9:15 AM GMT
భూతవైద్యం చేసే మహిళపై ప్రియుడు హత్యాచారం.. ఆ విషయంచెప్పి గుట్టపైకి తీసుకెళ్లి..!

తనను దూరం పెట్టిందని ఓ వివాహితను గుట్టపైకి తీసుకెళ్లి ఆమె ప్రియుడే అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడని పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం మల్లాపూర్‌లో లక్ష్మీదేవీ (41), శంకరయ్య గౌడ్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు ఉంది. అక్టోబర్‌ 22వ తేదీన తల్లి లక్ష్మీదేవీ తన కూతురు స్వాతిని కల్వకుర్తికి చెందిన వెంకటేశ్వరాచారితో కలిసి జడ్చర్లలోని హాస్టల్‌కి తీసుకువెళ్లింది. అదే రోజు ఇంటికి వెళ్లని.. లక్ష్మీదేవీ మున్ననూర్‌కు వెళ్లింది. భార్య ఇంటికి రాకపోవడంతో భర్త శంకరయ్య గౌడ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రవిప్రకాష్‌ రెడ్డి అనే వ్యక్తి బోయిన్‌పల్లి శివారులో సీతఫలాల కోసం పీర్లమాన్యంగుట్టపైకి వెళ్లాడు. అక్కడే మహిళ లక్ష్మీదేవీ మృతదేహాన్ని గుర్తించిన రవిప్రకాష్‌ రెడ్డి.. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు.

ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మహిళ హత్యకు గురైన ఆనవాళ్లతో పాటు.. అక్కడే దొరికిన ఆమె ఫోన్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తుతో మహిళ భూతవైద్యం చేసేదని, మల్లాపూర్‌కు చెందిన గంగిరెద్దుల వెంకటయ్యతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఇటీవల అతడిని లక్ష్మీదేవి దూరం పెట్టడంతో.. హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లాలని పన్నాగం పన్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత లక్ష్మీదేవిని పీర్లమాన్యంగుట్టలో బంగారు గనులు ఉన్నాయంటూ నమ్మించి అక్కడికి తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేశాడు. లక్ష్మీదేవి ఒంటిపై ఉన్న 6 తులాల బంగారు గొలుసు, నక్లెస్‌, చెవి కమ్మలు తీసుకొని పరారయ్యాడు. మంగళవారం రోజున నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story
Share it