మైనర్ బాలికపై అత్యాచారం

Another minor girl became the victim in Rajasthan. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  22 Jan 2022 6:36 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం

రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక‌ తన కుటుంబంతో కలిసి భూతవైద్యం కోసం వచ్చారు. అక్కడ భూతవైద్యం చేసే వ్యక్తి ఆమెను కామానికి బలిపశువును చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఝలావర్ జిల్లాకు చెందిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. కుమార్తె ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాబట్టి వారు భూతవైద్యం కోసం గ్రామంలోని ఒక వ్యక్తి వద్దకు వచ్చారు. 45 ఏళ్ల నిందితుడు పూజా సామగ్రిని సేకరించడానికి కుటుంబాన్ని పంపాడు. అనంత‌రం బాలికపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

కుటుంబ సభ్యులు పూజా సామగ్రితో తిరిగిరాగా బాలిక అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆ తర్వాత జరిగిన సంఘటన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే అప్పటికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితుడి కోసం వెతుకుతున్న క్ర‌మంలో శుక్రవారం సాయంత్రం ఝలావర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Next Story