పిల్లల్ని సరిగా పట్టించుకోవడం లేదని భార్యను హతమార్చిన భర్త
Angry husband beat wife so much that she passed away. మహారాష్ట్రలోని పూణెలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. తన బిడ్డలను
By Medi Samrat Published on
8 Dec 2021 8:55 AM GMT

మహారాష్ట్రలోని పూణెలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. తన బిడ్డలను భార్య సరిగా చూసుకోవడం లేదనే కోపంతో హతమార్చి.. ఆ కారణంగా అతడు కటకటాల పాలయ్యాడు. కోపంతో భార్యను కొట్టడంతో ఆమె ప్రాణాలు పోయాయి. హత్య చేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణెలోని కసేవాడి ప్రాంతంలో తౌసీఫ్ తన భార్య అస్మా షేక్, ముగ్గురు పిల్లలతో కలిసి ఉండేవాడు. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తౌసీఫ్ తన భార్య అస్మాతో 'పిల్లలను సరిగ్గా చూసుకోవడం లేదు, వాళ్లను పట్టించుకోవట్లేదని' వాదనకు దిగాడు. అస్మా వాదించడం మొదలుపెట్టడంతో తౌసీఫ్ కనికరం లేకుండా ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం అందరూ లేచి చూసేసరికి అస్మా లేవలేదు. తౌసిఫ్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు తౌసీఫ్‌ను అరెస్టు చేశారు.
Next Story