ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు రోగులు మృతి.!

Ahmednagar hospital fire accident. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగాయి.

By అంజి  Published on  6 Nov 2021 1:23 PM IST
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు రోగులు మృతి.!

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు పలు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐసీయూలో చేరిన రోగులను మరోచోటికి తరలిస్తున్నారు. ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న చాలా మంది రోగులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 5 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే జిల్లా అధికార యంత్రాంగం కరోనా రోగుల మృతి విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారాణాలు కూడా తెలియరాలేదు.

Next Story