బాలీవుడ్ సినిమా చూసి ఇన్‌స్ఫైర్‌ అయిన యువతి.. మోసాలు చేయడం మొదలు పెట్టిందట..

After watching Bollywood movie, bride committed the act of cheating. సినిమాలను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అయితే అందరూ పాజిటివ్ గా

By Medi Samrat  Published on  27 Feb 2022 7:36 PM IST
బాలీవుడ్ సినిమా చూసి ఇన్‌స్ఫైర్‌ అయిన యువతి.. మోసాలు చేయడం మొదలు పెట్టిందట..

సినిమాలను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అయితే అందరూ పాజిటివ్ గా తీసుకునే వారే ఉండరు. కొందరు సినిమాల్లోని నెగటివిటీని తీసుకుంటే.. మరికొందరు మంచి తనాన్ని తీసుకుంటూ ఉంటారు. అలా ఓ బాలీవుడ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయింది ఓ యువతి. ఆ సినిమా పేరు 'డాలీ కి డోలీ'. అందులో హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటించింది. పెళ్లిళ్లు చేసుకుంటానని చెప్పి మోసాలు చేయడమే ఆమె పని. ఇప్పుడు మధ్య ప్రదేశ్ లోని ఛతర్‌పూర్ లో ఒక యువతి ఇలాంటి మోసాలకే పాల్పడింది. ఈ ఘటన రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్పత్‌పురా గ్రామానికి చెందినది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.

రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోని దల్పత్‌పురా గ్రామంలో సోనాల్ లాల్ అనే వ్యక్తికి మధ్యవర్తి ద్వారా సాత్నాకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. అందరి సమక్షంలో వివాహం జరిగింది. మరుసటి రోజు వధువు తన భర్త నుండి ఫోన్ , బంగారు ఆభరణాలు డిమాండ్ చేసింది, అతను వాటిని ఇవ్వకపోతే ఇంటికి వెళ్లిపోతానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వరుడు ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. దీంతో వరుడి తండ్రి రూ.1.5 లక్షలు అప్పు తీసుకుని వధువుకు 16 వేల కొత్త ఫోన్, నగలు కొనుగోలు చేశాడు. వాటిని ఆమె తీసుకుంది. అయితే ఆ తర్వాత వధువు సోదరుడు ఇంటికి వచ్చాడు. తన సోదరిని పిలుచుకొని వెళ్తానని చెప్పాడు. అలా బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. సోనాల్ లాల్ ఇచ్చిన డబ్బులు, నగలు కూడా మాయమయ్యాయి. భార్య తిరిగి రాకపోవడంతో బాధితుడు సోహన్‌లాల్ తన కుటుంబసభ్యులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. మొత్తం కేసును విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. ఆ యువతి కూడా సినిమాను చూసి ఇన్స్పైర్ అయి మోసాలు చేస్తోందని.. ఆమె చేతిలో మరింత మంది మోసపోయినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.


Next Story