అడ్వకేట్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు

Advocate shot by bike-borne assailants in Delhi's Dwarka. ఢిల్లీలోని ద్వారక-1 ప్రాంతంలో శనివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు

By Medi Samrat
Published on : 2 April 2023 9:15 PM IST

అడ్వకేట్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు

ఢిల్లీలోని ద్వారక-1 ప్రాంతంలో శనివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఓ న్యాయవాదిని కాల్చిచంపారు. మృతుడిని ద్వారక సెక్టార్ 12లో నివాసముంటున్న వీరేందర్ కుమార్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎర్టిగా కారులో ఉండగా బైక్‌పై వచ్చిన దుండగులు అతడిని కాల్చిచంపారు. ద్వారకా కోర్టు కాంప్లెక్స్ సమీపంలో ఈ సంఘటన జరగలేదని, కోర్టు నుండి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు.

సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై విచారణకు పలు బృందాలను నియమించారు. నిందితులు అడ్వకేట్‌కి సంబంధించిన క్లయింట్లు కాదని, న్యాయవాది గ్రామానికి సంబంధించిన వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఈ హ‌త్య‌ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నిందితుల గురించి పక్కా ఆధారాలున్నాయని.. వారిని వెతికే పనిలో ఉన్నామని పోలీసులు పేర్కొన్నారు.


Next Story