మహిళ ఆత్మహత్య.. చాట్ హిస్టరీని బయటకు తీస్తే మొత్తం బయటపడింది

మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో ఆదివాసీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతదేహం హోటల్ గదిలో వేలాడుతూ కనిపించడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  30 April 2024 7:49 AM IST
మహిళ ఆత్మహత్య.. చాట్ హిస్టరీని బయటకు తీస్తే మొత్తం బయటపడింది

మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో ఆదివాసీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతదేహం హోటల్ గదిలో వేలాడుతూ కనిపించడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తితో మహిళ రిలేషన్ షిప్ లో ఉందని తెలిసింది. ప్రాథమిక విచారణలో.. జునైద్ అనే వ్యక్తితో ఆ మహిళ కాలేజీలో డేటింగ్ ప్రారంభించిందని తేలింది. ఇద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటున్నారని.. తరచుగా హోటల్ గదులను తీసుకుంటూ ఉండేవాళ్లని పోలీసులు తెలిపారు.

ఏప్రిల్ 28న వారు ధార్‌లోని ఓ హోటల్‌లో చెకిన్ అయ్యారు. జునైద్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. మహిళ లోపలి నుండి తలుపు వేసుకుని ఉంది. కొన్ని గంటలైనా ఆమె తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బృందం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, మహిళ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జునైద్‌ ఆ మహిళతో ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అతడి చాట్ హిస్టరీ ఆధారంగా జునైద్ పెళ్లి సాకుతో మహిళతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. ఆమె ఆదివాసీ వర్గానికి చెందినదని వాదిస్తూ పెళ్ళికి నిరాకరించాడు. పోలీసులు జునైద్‌ను అరెస్టు చేసి అతనిపై ఐపిసి సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు.

Next Story