విమానంలో నటి నడుము పట్టుకున్న వ్యాపారవేత్త.. ఆ తర్వాత ఒళ్లోకి..

Actress groped on flight recalls harrowing incident. విమానంలో టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా

By అంజి
Published on : 21 Oct 2021 9:13 AM IST

విమానంలో నటి నడుము పట్టుకున్న వ్యాపారవేత్త.. ఆ తర్వాత ఒళ్లోకి..

విమానంలో టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్‌ చేసి.. కోర్టులో హాజరుపర్చారు. అక్టోబర్‌ 3న టెలివిజన్‌ నటి విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లింది. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత పైన లగేజీ సెక్షన్‌లో ఉన్న తన బ్యాగును తీసుకునేందుకు నటి సీటులో నుంచి లేచి నిలబడింది. దీంతో పక్కనే ఉన్న వ్యాపారవేత్త.. ఆమె నడుమును పట్టుకొని ఒళ్లోకి లాక్కున్నాడు. దీంతో ఆ నటి ఒక్కసారిగా ప్రతిఘటించింది. మగవ్యక్తి అనుకొని అలా చేశానంటూ ఆ వ్యాపారవేత్త బుకాయించాడు. ఆ తర్వాత నటికి క్షమాపణలు చెప్పాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత ఆ నటి జరిగిన విషయాన్ని ఆ ఎయిర్‌లైన్‌ సంస్థకు మెయిల్‌ చేసి.. ఆ వ్యక్తి వివరాలు బయటపెట్టాలని కోరింది. అలా చేయలేమని, మీరు పోలీసులకు విషయాన్ని చెప్పాలని ఎయిర్‌లైన్ సంస్థ నటికి సూచించింది. అక్టోబర్‌ 4వ తేదీన ఆ నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. యూపీకి చెందిన సదరు వ్యాపారవేత్తను పోలీసులు ఈ నెల14న అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు మరో 24 గంటల పాటు నిందితుడికి కస్టడీ విధించింది. బాధిత నటి తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొని జరిగిన విషయాలను బయటపెట్టింది. ఆ వ్యాపారవేత్త చేసిన పనికి తాను ఎంతో భయాందోళనకు గురైయ్యానని నటి తెలిపింది. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వ్యాపారవేత్త కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని పేర్కొంది.

Next Story