ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

Accident Trolley Full Of Devotees Overturned 8 Killed 37 People Injured US Nagar. ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat
Published on : 28 Aug 2022 6:23 PM IST

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కిచ్చ సమీపంలో భక్తులతో నిండిన ట్రాలీ బోల్తా పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 37 మంది గాయపడినట్లు సమాచారం. గాయ‌ప‌డిన వారు ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కుటుంబీకులు తమ కళ్ల ముందే తమ బంధువుల మృతదేహాలను చూశారు.

పోలీసులు, జిల్లా యంత్రాంగం సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. శక్తి ఫామ్ ఏరియాలోని బాస్గర్ గ్రామానికి చెందిన దాదాపు 45 నుంచి 50 మంది భక్తులు యూపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉత్తమ్ నగర్‌లోని గురుద్వారాకు వెళ్తున్నారు. ఉత్తమ్ నగర్ గురుద్వారాలో ప్రతి ఆదివారం గురు గ్రంథ్ సాహిబ్ కా పాత్, లంగర్ కా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు భక్తులు వెళ్తుండ‌గా ప్ర‌మాదం చోటుచేసుకుంది.

ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశం బహెడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అవుట్‌పోస్టు సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి ట్రాలీ బోల్తా పడింది. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సహాయక చర్యలు ప్రారంభించారు.

ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా పుల్భట్టా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు.


Next Story