నెల్లూరులో బోల్తా ప‌డిన బ‌స్సు.. ఒక‌రి మృతి, ప‌ది మందికి గాయాలు

Accident In Nellore. నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెంద‌గా..

By Medi Samrat  Published on  31 Dec 2020 5:17 AM GMT
నెల్లూరులో బోల్తా ప‌డిన బ‌స్సు.. ఒక‌రి మృతి, ప‌ది మందికి గాయాలు

నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెంద‌గా.. 10 మందికి గాయా‌ల‌య్యాయి. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌మిళ‌నాడు నుంచి కోల్‌క‌త్తా కు వెలుతున్న బ‌స్సు ఈ తెల్ల‌వారుజామున‌ నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం వద్ద జాతీయ రహదారిపై అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది.

ప‌శ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వ‌ల‌స కూలీలు ఈ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్ర‌మాదం జురిగిన‌ట్లు తెలుస్తోంది. మృతి చెందిన వ్య‌క్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను కావ‌లి ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story