కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే నలుగురు మృత్యువాతపడగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం యర్రగుట్ట వద్ద జరిగింది. మృతి చెందిన వారంతా చిన్నారులే. మృతులను ఝాన్సీ(11), సురేఖ(10), వంశీ(10), హర్షవర్ధన్(11)గా గుర్తించారు. గాయపడిన బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.