ఘోర రోడ్డుప్రమాదం : 8 మంది మృతి
Accident In Karnataka. గురువారం ఉదయం కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on
15 Jan 2021 4:35 AM GMT

గురువారం ఉదయం కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యాన్‌ను టిప్పర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Next Story