రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
Accident In Jaggaiahpeta. కృష్ణాజిల్లా గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on
10 Dec 2020 3:44 AM GMT

జగ్గయపేట : కృష్ణాజిల్లా గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేములవాడ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లాలోని మధిరకు చెందిన మాచర్ల శ్యామ్, శారదా, శ్యామల గా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక వృద్ధుడు ఉన్నారు. కారులో డ్రైవర్ తో పాటు 9 మంది ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
Next Story