ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

Accident In Guntur District. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది.

By Medi Samrat  Published on  5 Jun 2023 5:58 PM IST
ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. మండ‌లంలోని కొండేపాడు గ్రామస్తులు వట్టి చెరుకూరు మీదుగా పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో జరుగుతున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 22 మందితో ట్రాక్టర్‌లో బయలుదేరి వెళుతుండగా ప్ర‌మాదం చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు గ్రామం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతో రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో ట్రాక్టర్ తిరగబడింది. ఘటనా స్థలంలో ఆరుగురు మృతి చెంద‌గా.. మిగ‌తా వారికి తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. తీవ్రగాయాల పాలైన ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను 108లో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story