గొడవేమో భార్యతో.. ఏడాది కాలంగా పోలీసులను బూతులు తిడుతూ..!

abusing cops to release frustration after fights with wife. గత ఏడాది కాలంగా ప్రతి రోజూ పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి దుర్భాషలాడుతున్న ఓ వ్యక్తిని

By Medi Samrat  Published on  8 April 2022 3:45 PM GMT
గొడవేమో భార్యతో.. ఏడాది కాలంగా పోలీసులను బూతులు తిడుతూ..!

గత ఏడాది కాలంగా ప్రతి రోజూ పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి దుర్భాషలాడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర లోని మన్పాడా పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యతో తగాదాల కారణంగా కోపాన్ని తగ్గించుకోడానికి పోలీసులకు ఫోన్ చేస్తూ తిట్టేవాన్నని, అలా చేసి తన ఫ్రస్టేషన్ ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాన్నని పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. దేశ్‌లేపాడ ప్రాంతంలో పోలీసులు అతడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు.

ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, "గత ఒక సంవత్సరం నుండి, మాకు కాల్స్ వస్తున్నాయి. ఆ వ్యక్తి పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అధికారులను దుర్భాషలాడేవాడు. మొదట్లో అధికారులు పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఆ కాల్ కాస్తా గుడి పడ్వా సీనియర్ ఇన్‌స్పెక్టర్‌కు బదిలీ అయింది. ఆరా తీస్తే ఇది రోజూ జరిగే తంతు అని తెలుసుకున్నారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ వెంటనే కాల్ చేసిన వ్యక్తిని గుర్తించమని కోరారు. నిందితుడు హేమంత్ కసారా ​​(36) డోంబివిలిలోని దేశ్‌లేపాడ నివాసి అని తేలింది. అతడు నిరుద్యోగి అని తెలుసుకున్నాము." అని తెలిపారు.

మాన్‌పాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ సర్జేరావు పాటిల్ మాట్లాడుతూ, "హేమంత్ కసారా మద్యానికి బానిస మరియు తరచుగా మద్యం మత్తులో తన భార్యతో గొడవపడేవాడు. గొడవ తర్వాత, అతను ఫోన్ బుక్‌లో మా పోలీస్ స్టేషన్ నంబర్ వెతికి, ఆపై కాల్ చేసి మమ్మల్ని దుర్భాషలాడేవాడు." అని తెలిపారు. మాన్‌పాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ బగాడే మాట్లాడుతూ, "పోలీసు సిబ్బంది సమయాన్ని దుర్వినియోగం చేసి తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడు. పోలీసు పనికి అంతరాయం కలిగించినందుకు మేము అతనిని అరెస్టు చేసాము." అని తెలిపారు.


Next Story
Share it