ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

బైక్ ఆపి చెకింగ్ చేసినందుకు ఒక యువకుడు నడి రోడ్డు మీద నానా హంగామా సృష్టించడమే కాకుండా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు

By Medi Samrat  Published on  10 Sept 2024 9:15 PM IST
ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపినందుకు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

బైక్ ఆపి చెకింగ్ చేసినందుకు ఒక యువకుడు నడి రోడ్డు మీద నానా హంగామా సృష్టించడమే కాకుండా... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమా దం తప్పింది. కానీ ఈ ప్రమాదంలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తొండుపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలోనే ఓ ట్రాఫిక్ పోలీస్ బైక్‌పై వస్తున్న ఓ యువకుడిని ఆపి బైక్ చెకింగ్ చేస్తున్నాడు. తన బైక్ ఎందుకు ఆపారంటూ ఆ యువకుడు ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగి రోడ్డు మీద నానా రచ్చ చేశాడు. అనంతరం ట్రాఫిక్ పోలీసులపై కోపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేయ‌గా.. ఈ ఘటనతో తొండుపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి అంబులెన్స్ చేరుకునే స‌మ‌యానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. అప్ప‌టివ‌ర‌కూ కాలిన గాయాలతో యువకుడు రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. ట్రాఫిక్ ను క్ర‌మంగా పోలీసులు క్లియర్ చేశారు. సదరు యువకుడు తాగిన మత్తులో ఈ పని చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story