25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం.. చేతులను తాడుతో కట్టి కిటికీలోంచి

A woman who came for a job in Churu and was sexually assaulted. ఢిల్లీ నుంచి ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం రాజస్థాన్‌లోని చురును సందర్శించిన 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

By అంజి  Published on  13 Feb 2022 12:13 PM IST
25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం.. చేతులను తాడుతో కట్టి కిటికీలోంచి

ఢిల్లీ నుంచి ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం రాజస్థాన్‌లోని చురును సందర్శించిన 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి, అక్కడి భవనంలోని మొదటి అంతస్తు నుంచి కిటికీలోంచి విసిరివేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన చురు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితుల్లో ఒకరు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో బాధితురాలు శుక్రవారం న్యూఢిల్లీ నుంచి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా.. ఆమె చురు చేరుకున్న తర్వాత, నలుగురు ఆమెను ఒక హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ దేవేంద్ర సింగ్, విక్రమ్ సింగ్ ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.

మహిళపై అత్యాచారం చేసిన తర్వాత, వారు ఆమె చేతులను తాడుతో కట్టి, హోటల్ మొదటి అంతస్తు గదిలోని కిటికీలోంచి బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షల అనంతరం నిందితులపై సామూహిక అత్యాచారం, కొట్టి చంపడం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మమతా సరస్వత్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులను భవానీ సింగ్, సునీల్ రాజ్‌పుత్‌లుగా గుర్తించారు. అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story