మహిళపై పోలీసు అధికారి అత్యాచారం.. గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్‌..!

A police officer raped a woman who went to lodge a complaint. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై ఓ పోలీస్‌ అధికారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మహిళ గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించారు.

By అంజి  Published on  7 Dec 2021 10:26 AM IST
మహిళపై పోలీసు అధికారి అత్యాచారం.. గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్‌..!

ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై ఓ పోలీస్‌ అధికారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మహిళ గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించారు. ఈ మొత్తం వ్యహారంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా 8 మంది కేసు నమోదు అయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ప్రాంతంలో తన తొమ్మిదేళ్ల కుమార్తెతో మహిళ (32) నివాసం ఉంటోంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత.. తాను ప్రేమించిన మరో వ్యక్తిని మహిళ రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండో భర్త మోసం చేశాడు. ఇదే విషయమై మహిళ పళుగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.

అప్పటి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుందరలింగం.. ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించాడు. ఈ క్రమంలోనే పలు చోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో మహిళ గర్భం దాల్చింది. వైద్య పరీక్షలని నమ్మించి స్నేహితులతో కలిసి ఆటోలో మహిళను పులియరంగిలోని క్లినిక్‌లో డాక్టర్‌ కార్మల్‌ రాణి దగ్గరికి తీసుకెళ్లగా.. ఆమె అబార్షన్‌ చేసింది. దీనిపై బాధితురాలు పలుసార్లు కకళియకోవిల్, మార్తాండం పీఎస్‌లలో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయాలలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కుళిత్తురై కోర్టును ఆశ్రయించింది బాధితురాలు. దీనిపై విచారించిన జస్టిస్‌.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు మార్తాండం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story