భార్యపై అనుమానంతో దారుణానికి తెగబడ్డ భర్త
A man set fire on her wife doubting her character. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో
By Medi Samrat Published on 17 Dec 2021 4:35 PM ISTఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెకు నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న ఆ మహిళ తన ప్రాణాలను కాపాడుకునేందుకు.. బాత్‌రూమ్‌కు వెళ్లి బాత్‌రూమ్‌కు తాళం వేసి కుళాయి కింద కూర్చుంది. అయితే.. మంటలు ఆరే సమయానికి ఆమె 50 శాతంకి పైగా కాలిపోయింది. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆమెను బాత్‌రూమ్‌లో నుండి బయటకు తీసి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడినుండి ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యులు రాయ్‌పూర్‌కు తరలించారు.
మరోవైపు ఈ కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు గురించి పోలీసులు వివరిస్తూ.. ఫరీద్‌నగర్‌లో నివసిస్తున్న సాజిద్ ఖాన్ గురువారం మధ్యాహ్నం తన భార్యను అనుమానిస్తూ ఆమెతో గొడవ పడ్డాడు. భార్య నజ్నిన్ నిషా అతనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా సాజిద్ నిరాకరించాడు. ఇద్దరి మధ్య చిచ్చు పెరగడంతో ఆగ్రహించిన భర్త చివరకు భార్యపై దాడికి పాల్పడ్డాడు. అప్పటికీ విషయం సద్దుమణగకపోవడంతో ఇంట్లో ఉంచిన పెట్రోల్‌ను భార్యపై పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతూ అరుస్తూ బాత్రూం లోపలికి పరిగెత్తి.. లోపలి నుండి లాక్ చేసి కుళాయి కింద కూర్చోగా.. మంటలు ఆరిపోయాయి. కానీ అప్పటికే ఆమె కాలిన గాయాలతో అరుస్తూ స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి ఆమెను బాత్‌రూమ్‌లోంచి బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.