మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన 'క్రిస్టినా వీటా అరండా' మరణించినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్పానిష్ భాష నుండి అనువదించబడిన BBC నివేదిక ప్రకారం, పరాగ్వేలోని శాన్ బెర్నార్డినోలోని జోస్ అసున్సియోన్ ఫ్లోర్స్ యాంఫిథియేటర్‌లో ఆదివారం జౌమినా ఫెస్ట్ సందర్భంగా కాల్చి చంపబడిన ఇద్దరు వ్యక్తులలో క్రిస్టినా వీటా కూడా ఉంది. ఆమె ముగ్గురు పిల్లల తల్లి.పరాగ్వే రాజధాని అసున్సియోన్‌లోని పార్క్ సెరెనిడాడ్ లో అరండాకు అంత్యక్రియలు నిర్వహించారు. అరండాను కాల్చిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాల్పుల్లో మరణించిన మరొక వ్యక్తిని మార్కోస్ ఇగ్నాసియో రోజాస్ మోరాగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అరండా గుండె ఆగిపోయిన తర్వాత 25 నిమిషాల పాటు ఆమెను బ్రతికించడానికి ప్రయత్నాలు జరిగాయని వైద్యులు చెప్పారు. ఆమెను కాపాడడానికి చాలా ప్రయత్నించారు. ఈ సంఘటనలో 23- 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నలుగురు వ్యక్తులు కూడా కాల్పుల కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అరండాను కాల్చి చంపింది మాదకద్రవ్యాల వ్యాపారి అని చెబుతున్నారు. అరండా ఇన్‌స్టాగ్రామ్‌లో 540,000 కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్నారు. ఆమె తనవి, పిల్లలవి చిత్రాలను వ్యాయామ క్లిప్‌లలను పోస్ట్ చేసేది. ఆమె TikTok, Facebookలో కూడా ప్రజాదరణ పొందింది. అరండా భర్త, ప్రొఫెషనల్ పరాగ్వే ఫుట్‌బాల్ ప్లేయర్ ఇవాన్ టోర్రెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంతాపం తెలిపారు. గత సంవత్సరం క్రిస్మస్ తర్వాత ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు.