నల్లగా ఉందని చెప్పి భార్యకు విడాకులు ఇచ్చిన భర్త

A divorced husband who says his wife is black in uttarpradesh. బాధితురాలు నలుపు రంగును దూషిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి ఇంటి నుంచి గెంటేశారు.

By అంజి  Published on  22 Nov 2021 8:10 AM IST
నల్లగా ఉందని చెప్పి భార్యకు విడాకులు ఇచ్చిన భర్త

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో భార్య నల్లగా ఉందని విడాకులు ఇచ్చిన భర్త సహా ఎనిమిది మంది నిందితులపై కాంట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన భర్త ఆలం, తండ్రి అనీస్ ఖాన్, అత్త చందాబీ, కుల్సూమ్ జహాన్, సీమా, నిషా, నసీమ్, మోబిన్‌లపై వరకట్న వేధింపులు, ట్రిపుల్ తలాక్ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్‌లో నివాసం ఉండే మహిళ తనకు తొమ్మిది నెలల క్రితం మహ్మద్ ఆలంతో మార్చి 2021లో వివాహమైందని ఎస్‌ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వివాహానంతరం భర్తతో పాటు మామ అనీస్ ఖాన్, అత్త చందా బీ, జితాని కుల్సుమ్ జహాన్, కోడలు సీమా, నిషా, రెండవ కోడలు నసీమా, మోబిన్‌లను వెక్కిరించడం ప్రారంభించారు.

వివాహం సమయంలో మూడు ఎకరాల భూమి కట్నంగా ఇచ్చారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించారు. రూ.10 లక్షలు తేవాలని, ఆ డబ్బులతో కారు కొనుగోలు చేయాలని బాధితురాలిని ఒత్తిడికి గురి చేశారు. బాధితురాలు నిరాకరించడంతో దాడి చేశారు. బాధితురాలు నలుపు రంగును దూషిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి ఇంటి నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు కాంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధిత మహిళ ఎస్‌ఎస్పీని ఆశ్రయించింది. ఎస్‌ఎస్పీ ఆదేశాల మేరకు నివేదిక సమర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కాంట్‌ రాజీవ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

Next Story