విశాఖలో దారుణం.. ప్రియుడి కోసం తండ్రిపై బాలిక కత్తితో దాడి

A daughter attacked her father with a knife after falling in love with her boyfriend in Visakhapatnam. ఏపీలోని విశాఖపట్నంలో దారుణ ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ బాలిక

By అంజి  Published on  22 Jan 2023 12:22 PM IST
విశాఖలో దారుణం.. ప్రియుడి కోసం తండ్రిపై బాలిక కత్తితో దాడి

ఏపీలోని విశాఖపట్నంలో దారుణ ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ బాలిక తన కన్న తండ్రి హత్యకు యత్నించింది. తండ్రిపై కత్తితో దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిందిత. స్థానికంగా నివసిస్తున్న ఓ వ్యక్తికి ఇంటర్మీడియట్‌ చదువుతున్న కుమార్తె ఉంది. బాలికకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతడితో బాలిక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.

తండ్రికి తెలియకుండా ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. అయితే ఈ విషయం తండ్రికి తెలిసింది. దీంతో తండ్రి కూతురిని నిలదీశాడు. క్రమంగా అది గొడవకు దారి తీసింది. దీంతో వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని తండ్రి మెడపై పొడవడానికి ప్రయత్నించింది కూతురు. అయితే అతడు తప్పుకోవడంతో కత్తి వీపుకు గుచ్చుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Next Story