పిల్లలు పుట్టాలని.. ఇద్దరు మహిళల బలి.. విస్తుపోయే విషయాలు.!

A couple who killed two women to give birth to children. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సంతానం కలగాలని ఇద్దరు మహిళలను భూత వైద్యుడి ఆదేశం మేరకు ఓ జంట హత్య చేసిన

By అంజి  Published on  25 Oct 2021 9:48 AM IST
పిల్లలు పుట్టాలని.. ఇద్దరు మహిళల బలి.. విస్తుపోయే విషయాలు.!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సంతానం కలగాలని ఇద్దరు మహిళలను భూత వైద్యుడి ఆదేశం మేరకు ఓ జంట హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బంటు బదౌరియా, మమతలకు 18 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే వీరికి ఇప్పటికి పిల్లలు పుట్టలేదు. దీంతో స్నేహితుడు నీరజ్‌ పర్మార్‌.. వారిని ఓ భూతవైద్యుడి గిర్వార్‌ యాదవ్‌కు దగ్గరికి తీసుకెళ్లాడు. వ్యక్తిని బలిస్తే దంపతులకు సంతానం కలుగుతుందని భూతవైద్యుడు చెప్పడంతో.. మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ బలిచ్చేందుకు వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించాడు. చివరకు ఈ నెల 13వ తేదీన ఓ సెక్స్ వర్కర్‌ను తీసుకువచ్చి..ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని బైక్‌పై తీసుకువెళ్తుండగా.. జారి కింద పడింది. దీంతో మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసి నీరజ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంత జరిగిన బలి ఇచ్చే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ను హత్య చేశారు. సెక్స్‌ వర్కర్‌కు మత్తుమందు ఇచ్చి భూతవైద్యుడి ఆమెను హత్య చేశారు. అక్టోబర్‌ 21న మహిళ మృతదేహం లభించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీరజ్‌ పర్మార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దంపతులు, భూతవైద్యుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారు భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌, బంటు భదౌరియా, అతని భార్య మమత, అతని సోదరి మీరా రాజవత్‌, వారి స్నేహితుడు నీరజ్ పర్మార్‌లు ఉన్నారు. బలి ఇచ్చిన సెక్స్‌ వర్కర్లతో నీరజ్‌ లైంగిక సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.

Next Story