ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 14 ఏళ్ల బాలుడు.. మూడో తరగతి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫతేగఢ్‌ జిల్లాలోని ఫతేపూర్‌లోని ఖగా ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం నాడు మూడో తరగతి చదువుతున్న బాలికపై తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి గయాదత్ మిశ్రా తెలిపారు.నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాలికను ఆసుపత్రిలో చేర్చామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

యూపీలో మహిళలు, చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మానవత్వం మంట గలిసేలా కామాంధులు వ్యహారిస్తున్నారు. చిన్నా, పెద్ద, వావీ వరసలు లేకుండా మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు మరిన్ని కఠినాతికఠినమైన చట్టాలను తీసుకువస్తే తప్ప.. కామంధుల్లో మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని మహిళలను కాపాడాలి.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story